జీవనశైలికి సంబంధించిన అనారోగ్యాలతో బాధపడుతున్న 68% మంది భారతీయ ఉద్యోగినులు
మూడింట రెండువంతుల మంది ఉద్యోగినులైన మహిళలు జీవనశైలికి
సంబంధించిన రోగాలతో
బాధపడుతూ ఉంటే, వారిలో 53%మంది పనివత్తిడి వలన, నిర్ణీత సమయంలో అతి ఎక్కువ
పనిని పూర్తి చేయాల్సి రావటం వలన, భోజనం చేసే సమయం లేక చిరుతిళ్ళు
తింటున్నారని తెలిసింది.
అసోసియెటేడ్ చేంబర్ ఆఫ్ కామర్స్ ఎండ్ ఇండస్ట్రి (ASSOCHAM),
నిర్వహించిన ఒక సర్వే ప్రకారం 21 నుండి 50 సంవత్సరం మద్య వయస్సుగల
ఉద్యోగినులలో 68% మంది స్థూలకాయం, మనోవ్యాధి,
ధీర్ఘకాల వెన్నునెప్పి, మధుమేహం, అధిక రక్తపోటు వంటి, జీవనశైలికి
సంబంధించిన వ్యాధులకు
గురయినట్లుగా గుర్తించారు.
భారతదేశపు నగరాలలో 27% మంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారని, వారి
ఆరోగ్య సమస్యలు
సమాజానికి, వ్యాపార రంగానికి ఒక పెద్ద సవాలుగా పరిణమిచిందని కూడా,ఆ
నివేదిక ప్రకటించింది.
”ఆరోగ్య పరిరక్షణ మరియు కార్పొరేట్ రంగంలో మహిళా ఉద్యోగినులు”, అనే
అంశం మీద చేపట్టిన, ఈ అధ్యయనం ప్రకారం ధీర్ఘకాలిక పని గంటలు,
నిర్ణీతకాలంలో తప్పనిసరిగా పని పూర్తిచేయాల్సి రావటం, అనే రెండు కారణాల
వలన, ఉద్యోగినులలో 75% మంది మానసిక వ్యాధులకు గురికావటం,
ప్రతిదానికి ఆందోళనచెందటం జరుగుతున్నదని తెలియవచ్చింది. చేస్తున్నపనిలో
మానసిక వత్తిడులు తక్కువగా ఉన్న వారికి ఈ రకపు అనారోగ్యం కూడా తక్కువగా
ఉంటుంది.
ఎక్కువ పని ఒత్తిడి కలిగిన సమాచార మాధ్యమాల రంగం, విజ్ఞాన విషయానికి
సంబంధించిన
వ్యాపారాలు, పర్యటనలు ఆవశ్యకత గల ఉద్యోగాల రంగాలలో పనిచేసే మహిళలు, వారి
ఆరోగ్యం బాగాలేనప్పటికీ సెలవు తీసికోలేని పరిస్థితులలో ఉన్నారు.
ప్రత్యేకించి, ఆర్థిక వ్యవస్థ, అస్తవ్యస్థంగా ఉన్న ప్రస్తుత పరిస్థితులలో,
ఉద్యోగాలలో ఉన్న అభద్రతా భావం వలన ,ఎంతటి కఠిన పరిస్థితులలో కూడా వారు
ఉద్యోగాలను అంటిపెట్టుకునే ఉంటున్నారు.
పారిశ్రామిక కాలుష్య పరిస్థితులలో పనిచేయటం వలన, వాతావరణంలో ఉండే విషవాయువుల ప్రభావం, నిద్రలేమి, వ్యాయమం లేకపోవటం, ఎండలో ఎక్కువగా తిరగటం, పోషక పదార్థాల లోపం, అతిగా మద్యపానం చేయడం, మత్తుపదార్థాలు వాడటం, ఇవన్నీ కూడా మనోవ్యాధికి కారణభూతాలని కూడా ఆ నివేదిక వెల్లడిచేసింది.
ప్రత్యేకించి ఉద్యోగాలు చేసే మహిళలు సమాజంలో అతి ప్రధానమయిన మరియు
బహుముఖపాత్రను నిర్వహిస్తున్నారని ఈ నివేదిక వాస్తవాన్ని
తెలియచేసింది. ఇంటిలొను మరియు కార్యాలయాలోను
తమ బాధ్యతల పట్ల మహిళలు సమతౌల్యాన్ని పాటించవలసిన ఆవశ్యకత ఎంతైనా
ఉంది.
ఆరోగ్య పరిరక్షణ పట్ల శ్రద్ధ లేకపోవటం వలన, ఆమె కుటుంబం, పనిచేసే
కార్యలయం, మరియు
పరిచయస్తుల, పరిసర పరిస్థితుల మీద ఎంతో వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తుందని
ఆ నివేదిక తెలిపింది.
ప్రశ్నావళిపై స్పందించినవారిలో 77% మంది, తాము సాధారణ వైద్య పరీక్షలను
చేయించుకోవట్లేదని
చెప్పారు. ఇంట్లోను, కార్యాలయంలో ఉన్న అధికమైన పనివత్తిడి ,వ్యక్తిగత
సామాజిక అవసరాలకోసమే ఉన్న సమయమంతా వెచ్చించడం వలన, వారు ఆరోగ్య విషయాన్ని
నిర్లక్ష్యం చేయాల్సివస్తుందని వెల్లడయింది.
ప్రశ్నార్థులలో 47% మంది సంవత్సరానికి కేవలం రూ. 500/- లేదా అంతకంటే తక్కువ మొత్తాన్ని ఆరోగ్యానికై వెచ్చిస్తున్నట్లు చెప్పారు. 27% మంది స్థూలకాయం, మనోవ్యాధి, స్పాండిలైటిస్ వంటి జబ్బుల పైన రూ500/- నుంచి రూ.5000/- వరకు ఖర్చు చేస్తున్నట్లు నివెసిక తెలిపింది.
ప్రశ్నార్థులలో 29%మందికి పైగా సంవత్సరానికి ఆరోగ్య పరిరక్షణకై
రూ.50,000 వేల వరకు ఖర్చు
చేస్తున్నట్లుగా తెలిపారు. అయితే వీరిలో చాలా మంది అధిక లేక అల్ప
రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధులు, మూత్ర సంబంధిత
వ్యాధులు మరియు ఎముకల వ్యాధులతో బాధ పడుతున్నట్లుగా ఈ నివేదిక
వివరించింది.

